Niharika | మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తన అభిరుచికి తగ్గ కంటెంట్‌తో సినిమాలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఆమె నిర్మించిన రెండో చిత్రం రాకాస నేడు థియేటర్లలోకి రాగా, ప్రీమియర్ షోల నుంచే మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌లో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. లవ్, కామెడీ, ఫాంటసీ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ప్రీమియర్ షోల ద్వారా స్పష్టమవుతోంది.
సోషల్ మీడియాలో నెటిజన్లు సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేస్తూ, ముఖ్యంగా కామెడీ ట్రాక్ , వినోదాత్మక కథనాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా చూసిన మెగా హీరో వరుణ్ తేజ్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం మరింత ఆసక్తిని పెంచింది. ‘రాకాస’ చూశాను… చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. కామెడీ ఈ సినిమాలో హైలైట్. నవ్వు ఆపుకోలేరు. సంగీత్ శోభన్ అద్భుతమైన టాలెంట్. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను అదరగొట్టేశారు. డైరెక్టర్ మానస శర్మకు, నా స్టార్ ప్రొడ్యూసర్ నిహారికకు శుభాకాంక్షలు అంటూ వరుణ్ తేజ్ పోస్ట్ చేశారు.
అయితే హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక ప్రీమియర్ షోకు మెగా కుటుంబ సభ్యులు హాజరై తెగ సందడి చేశారు. నిహారికకు మద్దతుగా సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల, వరుణ్ తేజ్– లావణ్య త్రిపాఠి దంపతులు, సాయిధరమ్ తేజ్ తదితరులు పాల్గొని తమవంతు సపోర్ట్ అందించారు. సాయిధరమ్ తేజ్ థియేటర్ లో విజిల్స్ వేస్తూ ఉత్సాహాన్ని పెంచడం విశేషం. అలాగే ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రీమియర్ కు హాజరై సినిమాను వీక్షించి నిహారికను ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రశంసలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్గా ‘రాకాస’ ప్రేక్షకులను నవ్వులతో అలరించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
#Rakasa
Family Motham Vachesaru Gaa 😂👌 pic.twitter.com/hUlcrYUdsW— LUCKY🦁 (@alwaysluckyRC27) April 3, 2026