Raghav Chadha: గొంతు నొక్కారు.. కానీ ఓడించలేరు: ఎంపీ రాఘవ్ చద్దా
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ తన గొంతును నొక్కేసిందని, కానీ తనను ఓడించలేరని ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. పార్లమెంట్లో ప్రజల సమస్యలపై మాట్లాడడం నేరం అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఎక్స్ అకౌంట్లో ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు.
న్యూఢిల్లీ: రాజ్యసభ ఉపనేత పదవి నుంచి ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha)ను ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించిన విషయం తెలిసిందే. అతనికి మైక్ ఇవ్వవొద్దు అంటూ రాజ్యసభ సెక్రటేరియేట్‌కు ఆ పార్టీ లేఖ రాసింది. ఈ అంశంపై ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. తన గొంతును నొక్కేశారని, కానీ తనను ఓడించలేరని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీలకు సందేశం ఇస్తున్నట్లు ఆ వీడియోలో ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రజల సమస్యలపై మాట్లాడే అవకాశం వచ్చిందని, సాధారణ ప్రజల అంశాలను ప్రస్తావించేందుకు అవకాశం తనకు వచ్చిందని, అయితే ప్రజల సమస్యల గురించి మాట్లాడడం నేరం అవుతుందా అని ఆమ్ ఆద్మీ పార్టీని ఆయన ప్రశ్నించారు. నేనేమైనా నేరం చేశానా, పొరపాటు చేశానా, తప్పు చేశానా అని అన్నారు. పార్లమెంట్లో తనను మాట్లాడనివ్వొద్దని రాజ్యసభ సెక్రటేరియేట్‌కు ఆప్ చెప్పిందని, అందుకే తాను ప్రశ్నిస్తున్నట్లు రాఘవ్ తెలిపారు.
Silenced, not defeated
My message to the ‘aam aadmi’
—
खामोश करवाया गया हूँ, हारा नहीं हूँ‘आम आदमी’ को मेरे संदेश pic.twitter.com/poUwxsu0S3
— Raghav Chadha (@raghav_chadha) April 3, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

