Perni Nani | మచిలీపట్నం పోలీసులు, మున్సిపల్ అధికారులపై ఆగ్రహం.. పేర్ని నానిపై కేసు నమోదు
Perni Nani | వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలో కొబ్బరితోట ప్రాంతంలో చేపట్టిన అక్రమ ఇంటి నిర్మాణాన్ని నిన్న అధికారులు కూల్చివేశారు.
Perni Nani | వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలో కొబ్బరితోట ప్రాంతంలో చేపట్టిన అక్రమ ఇంటి నిర్మాణాన్ని నిన్న అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో తన అనుచరులతో కలిసి అక్కడకు చేరుకుని అధికారులపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పేర్ని నానిపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదైంది.
మంత్రి కొల్లు రవీంద్రకు తొత్తులగా పనిచేస్తూ.. నోటీసులు ఇవ్వకుండానే ప్రజల ఇళ్లను కూల్చడంపై మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు మీద ఆగ్రహం వ్యక్తంచేశారు. 2029లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తానని బెదిరించారు. కొల్లు రవీంద్రకు తొత్తులగా పనిచేసే ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టేది లేదని పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు. కొల్లు రవీంద్ర గుర్తుపెట్టుకో.. నువ్వు చెప్పావని ఇల్లు కూల్చేందుకు కాపలాగా వచ్చిన సీఐ, ఎస్సైలను మళ్లీ బందరు తీసుకొస్తా.. వాళ్లనే కాపలాగా పెట్టి.. నీకు ఇలాగే చూపిస్తానని హెచ్చరించారు. ఇప్పుడు ఇళ్లను కూల్చేందుకు వచ్చిన అధికారులను ఎవరినీ వదలమని.. వాళ్ల సంతి చూస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా వారిని బందరు తీసుకొచ్చి మరీ కొల్లు రవీంద్ర ఇంటిని కూల్చేస్తామని అన్నారు. జేసీబీలు, గునపాలు తిగితే ఎలా ఉంటుందో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చైదరికి తెలిసేలా చేస్తానని తేల్చిచెప్పారు.
బందరు నుంచి వెళ్లిపోయి.. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా అసిస్టెంట్ కమిషనర్ గోపాల్రావు ఇంటి సంగతి చూస్తానని అన్నారు. తెలంగాణకు పోయినా.. కేసీఆర్ కాళ్లు పట్టుకుని.. నిన్ను తీసుకొచ్చి మరీ నీ ఇంటి సంగతి తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఏసీపీ ఇంటికి కూడా ప్లాన్ లేదని ఆయన ఇంటి సంగతి కూడా చూస్తానని హెచ్చరించారు.
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా
అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావుకు పేర్నినాని వార్నింగ్
నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను.. బందరు కాదు, ఏపీలో ఎక్కడ ఉన్నాసరే
నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా
మచిలీపట్నంలో… pic.twitter.com/cDYEa4wCnT
— Telugu Scribe (@TeluguScribe) April 2, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

