Group-4 | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల 26న నియామకపత్రాలిచ్చే అవకాశముంది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. గ్రూప్-4 ఫలితాలను 14న విడుదల చేశారు. మొత్తం 8,084 మంది అభ్యర్థులకు గ్రూప్-4 ఉద్యోగాలిచ్చారు.
ఇరిగేషన్‌కు 49 మంది జేఏలు
హైదరాబాద్, నవంబర్18 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్‌శాఖలో కొత్తగా 49మంది జూనియర్ అసిస్టెంట్లు(జేఏ) రానున్నారు. ప్రభుత్వం గ్రూప్-4 ఫలితాలను ఇటీవలే వెల్లడించింది. ఇరిగేషన్‌శాఖకు 50 పోస్టులు మంజూరయ్యాయి. టీజీపీఎస్సీ ప్రస్తు తం 49 పోస్టులకే అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ జాబితాను ఇరిగేషన్‌శాఖ అధికారులకు పంపించింది. అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 17 మంది జూనియర్ అసెస్టింట్లను(జేఏ) కేటాయించారు.