Group-3 Results | పాపన్నపేట, మార్చి 14 : గ్రూప్ -3 స్టేట్ టాపర్‌గా పాపన్నపేటకు చెందిన అర్జున్ రెడ్డి నిలిచాడు. శుక్రవారం టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో అర్జున్ రెడ్డి 339.239 మార్కులతో స్టేట్ ప్రథమ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ -2 లో స్టేట్ 18వ ర్యాంక్ సాధించాడు. అర్జున్ రెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేసి, ప్రస్తుతం హవేలీ ఘనపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తూ, మెదక్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. వరుసగా ప్రకటించిన ఫలితాల్లో అర్జున్ మంచి ప్రతిభ కనబర్చడం పట్ల మండల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా గ్రూప్ -2 పోస్టుకు ప్రాధాన్యత ఇస్తానని అర్జున్ రెడ్డి తెలిపారు. అర్జున్ రెడ్డి హాల్ టికెట్ నంబర్ – 2295819138.