1,365 పోస్టులతో గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల
TSPSC | తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. నిన్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా, తాజాగా గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదలైంది. 1365 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. నిన్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా, తాజాగా గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదలైంది. 1365 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ మధ్యలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 783 గ్రూప్-2 పోస్టులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తదితర వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. మరోవైపు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

