Group-2 Primary Key | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-2 ప్రాథమిక ‘కీ’ శనివారం విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక ‘కీ’ని వెబ్సైట్లో పొందుపరచనుండగా, ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్లో ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు తెలుపవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
కాగా, 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పారు. అభ్యంతరాలను కేవలం ఆంగ్ల భాషలోనే తెలపాలని సూచించారు. అభ్యర్థులు చెప్పదలచుకున్న అభ్యంతరాలకు తప్పనిసరిగా.. ఆ అంశం ఏ పుస్తకంలోనిది..? ఆథర్ ఎవరు..? ఎడిషన్, పేజీ నంబర్, పబ్లిషర్స్ పేరు లేదా వెబ్సైట్ యూఆర్ఎల్ను మెన్షన్ చేయాలని చెప్పారు. ఇక అభ్యంతరాలను ఈ మెయిల్ ద్వారానే పంపాలన్నారు. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలను నిర్వహించింది.