హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-2 పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 23, 24న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వెరిఫికేషన్ నిర్వహిస్తామని వెల్లడించింది.
ఈ రెండు తేదీల్లో హాజరుకాని వారికి ఈ నెల 25న రిజర్వుడే ఉంటుందని కమిషన్ కార్యదర్శి డాక్టర్ ప్రియాంక తెలిపారు. అభ్యర్థుల జాబితాను https:// www. tgpsc.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని వెల్లడించారు. 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని సూచించారు.