హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీలో భాగంగా శనివారం మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. శనివారం ఉదయం 10:30 గంటల నుంచి నాంపల్లి తెలుగు వర్సిటీలో వెరిఫికేషన్ జరుగుతుందని టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక తెలిపారు.
రిజర్వుడేగా ఈ నెల 15న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. వివరాల కోసం https://www.tgpsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.