Group-2 | సీఎం రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నిరుద్యోగ యువత.. అశోక్‌నగర్‌లో భారీ ధర్నా
Group-2 | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిరుద్యోగ యువత భగ్గుమన్నారు. నిరుద్యోగులను అవమానించేలా రేవంత్ మాట్లాడుతున్నారని నిరుద్యోగులు ధ్వజమెత్తారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో భారీ ధర్నాకు దిగారు.
Group-2 | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిరుద్యోగ యువత భగ్గుమన్నారు. నిరుద్యోగులను అవమానించేలా రేవంత్ మాట్లాడుతున్నారని నిరుద్యోగులు ధ్వజమెత్తారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో భారీ ధర్నాకు దిగారు. రోడ్డును దిగ్భందం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతోందని నిరుద్యోగులు తేల్చిచెప్పారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. తమ వెనుకాల ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టం చేశారు. కావాలని కొందరు సీఎం రేవంత్ రెడ్డికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని పేర్కొన్నారు. గ్రూప్ -1 మెయిన్స్‌కు 1:100 పిలవాలి.. దాంతో పాటు గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలి. డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేసి 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ధర్నా చేస్తూనే స్పృహ కోల్పోయిన ఓ యువతి
అశోక్‌నగర్‌లో ధర్నా చేస్తూనే ఓ నిరుద్యోగ యువతి స్పృహ కోల్పోయారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆమె ధ్వజమెత్తారు. ధర్నాలు చేసి అలసిపోతున్నామని చనిపోయే పరిస్థితి ఏర్పడినా కూడా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆ యువతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అశోక్ నగర్లో ఉద్రిక్తత
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న నిరుద్యోగులు https://t.co/IuT7eumcr7 pic.twitter.com/aMC3mW5XdP
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2024
ఇవి కూడా చదవండి..
Gun Miss Fire | నార్సింగిలో తుపాకీ మిస్ ఫైర్.. బెడ్రూంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
boianpalli vinod kumar | పార్టీ మారుతున్న వాళ్లను చూసి బాధపడక్కర్లేదు: బోయిన్పల్లి వినోద్‌కుమార్
షాద్‌నగర్ రియల్టర్ హత్య కేసులో ట్విస్ట్.. పెద్ద కొడుకే అసలు సూత్రధారి!
MLA Arekapudi Gandhi | కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగపల్లి ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

