హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ -1 నియామకాలపై అభ్యర్థుల మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ ఉత్తర్వులను రద్దుచేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్సీ)ను దాఖలు చేశారు. ఈ కేసు దసరా తర్వాతే విచారణకు రానున్నది.
నేడు అంబేదర్ వర్సిటీ స్నాతకోత్సవం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏఓయూ) 26వ స్నాతకోత్సవాన్ని నేడు(మంగళవారం) క్యాంపస్లో నిర్వహించనున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం జరగనున్నట్టు తెలిపారు. ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇగ్నో వీసీ ప్రొఫెసర్ ఉమా కాంజీలాల్ హాజరుకానున్నారు.