హైదరాబాద్ : స్వరాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-2తో పాటు పోలీసు కానిస్టేబుల్స్, టీచర్, వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖల్లో భారీగా పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. కానీ గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. తొలిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. గ్రూప్ -1 కింద 503 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభా వేదికగా వెల్లడించారు. దీంతో గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డిప్యూటీ కలెక్టర్ (సివిల్ సర్వీసెస్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్- కేటగిరీ II (పోలీస్ సర్వీస్)
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
జిల్లా పంచాయతీ అధికారి (పంచాయతీ సేవలు)
జిల్లా రిజిస్ట్రార్లు
డివిజనల్ ఫైర్ ఆఫీసర్
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి
మున్సిపల్ కమీషనర్
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
అసిస్టెంట్ ట్రెజరీ అధికారి
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి
మున్సిపల్ కమిషనర్- గ్రేడ్ II
మండల పరిషత్ అభివృద్ధి అధికారి
జిల్లా ఉపాధి అధికారి
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి
అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్
కో-ఆపరేటివ్ సర్వీసెస్ డిప్యూటీ రిజిస్ట్రార్
ప్రాంతీయ రవాణా అధికారి
TS ఉపాధి మరియు శిక్షణ సేవలో జిల్లా ఉపాధి అధికారి
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్