హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్ హాల్‌టికెట్లను 14న విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. పరీక్ష కు ఒక రోజు ముందు(ఈ నెల 21) వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. 21 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి అభ్యర్థులు 040 -23542185, 040 -235421 87 హెల్ప్‌లైన్ నంబర్లు, Helpdes k@tspsc. gov. in ఈ-మెయిల్‌ను సంప్రదించాలి. జనరల్ ఇంగ్లిష్ తప్ప అన్ని పేపర్లను తె లుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో రాయవచ్చు.
14న కోర్టు కేసు
గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం ఫైనల్ ‘కీ’లో 7 ప్రశ్నలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అభ్యర్థులు హైకోర్టులో కేసు వేయగా, 14న విచారణకు రానుంది. ఈ కేసును పక్కదారి పట్టించేందుకే హాల్‌టికెట్లను వెబ్సైట్లో పెడుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గ్రూప్-1పై స్టే రావాలంటే మెయిన్ రాసే అభ్యర్థులెవరూ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోకుండా ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు.