Group 1 Mains | 563 X 50 ఎంతో తెలియదా.. సీఎంకు జీవో 29పై అవగాహన ఉన్నదా?.. గ్రూప్-1 అభ్యర్థులు సందేహాలు
పోలీస్ అకాడమీలో గ్రూప్-1 పరీక్షల గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన స్పీచ్‌పై పలువురు అభ్యర్థులు సందేహాలు లేవనెత్తారు. రేవంత్‌రెడ్డి మాటలు మొత్తం వింటే ఆయనకు జీవో 55కి, 29కి అవగాహన లేదని స్ప ష్టంగా అనిపిస్తుందని పేర్కొన్నారు.
Group 1 Mains | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): పోలీస్ అకాడమీలో గ్రూప్-1 పరీక్షల గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన స్పీచ్‌పై పలువురు అభ్యర్థులు సందేహాలు లేవనెత్తారు. రేవంత్‌రెడ్డి మాటలు మొత్తం వింటే ఆయనకు జీవో 55కి, 29కి అవగాహన లేదని స్ప ష్టంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. ‘జీవో 29 ద్వారా 1:50కి ఎంపిక చేయాలని 31 వేల చిల్లర మందిని ఎంపిక చేశారంట.. 563 X 50 ఎం త అవుతుందో సీఎంకు తెలీదా?’ అంటూ పలువు రు వివిధ మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
- జీవో 55 వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది, జీవో 29 వల్లే ఆయా వర్గాల్లో ఎకువ మంది మెయిన్స్‌కి ఎం పికయ్యారు అని చెప్తున్నారు? ఇది ఆయనకు తెలిసి అన్నారా? లేక అభ్యర్థుల ఉద్యమాన్ని తానే రివర్స్‌గా అర్థం చేసుకొని అలా చెప్పారా? ఆయనకే తెలియాలి.
- అసలు మనం ఉద్యమిస్తున్నది జీవో 29కి వ్యతిరేకంగా అని కాకుండా, 1:100 కావాలని ఉద్యమిస్తున్నట్టు ఆయన మాట ల్లో అర్థమవుతుంది. తెలిసి అన్నడా? తెలీక అన్నాడా?
- 10 సంవత్సరాల నుంచి పరీక్షలు పెట్టాలని ధర్నాలు చేసి.. ఇప్పుడు పరీక్షలు ఆపమని ధర్నాలు చేస్తున్నారని చెప్తున్న సీఎంకు.. అసలు సమస్య తెలియదని అర్థమైంది.
- జీవో 29 గురించి కోర్టుకు వెళ్తే మనకు ఎలాంటి రిలీఫ్ రాలేదం టే ఆ వాదనలో బలం లేదని హైకోర్టు భావించిందంట. అ య్యా సీఎం గారు దాని ఫైనల్ ఇయరింగ్ నవంబర్ 20న ఉన్నదనే విషయం కూడా మీకు తెలియదు. మీరో ముఖ్యమంత్రి.
- మీ మొండివైఖరికి త్వరలో కోర్టులే సమాధానాలు చెప్తాయి. అప్పుడు మీరు తలకాయ ఎక డ పెట్టుకుంటారో మీ ఇష్టం.
ఇట్లు
వేదనాభరిత మనసుతో జీవో 29కి వ్యతిరేకంగా నిరసనలుతెలుపుతున్న ఓ గ్రూప్-1 అభ్యర్థి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

