Ground Water | లోలోతుకు భూగర్భజలాలు.. నీటిని ఎత్తిపోసి చెరువులు నింపకుంటే అంతేసంగతులు!
వానలు కురువకపోవడం, రిజర్వాయర్లు అడుగంటడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలమట్టాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో వేసవిలోనే సగటు భూగర్భజలమట్టం 6.22 మీటర్లు కాగా, ప్రస్తుతం ఏకంగా 9.34 మీటర్లకు చేరుకోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది.
Ground Water | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): వానలు కురువకపోవడం, రిజర్వాయర్లు అడుగంటడంతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలమట్టాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో వేసవిలోనే సగటు భూగర్భజలమట్టం 6.22 మీటర్లు కాగా, ప్రస్తుతం ఏకంగా 9.34 మీటర్లకు చేరుకోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం 9.34 మీటర్లు ఉండగా, 13 జిల్లాల్లో 10 మీటర్లకంటే ఎక్కువ లోతుకు చేరుకున్నాయి.
ఇక కృష్ణాబేసిన్‌లో భూగర్భజలమట్టం ఆశించినంత మెరుగ్గా లేదు. కానీ గోదావరి బేసిన్లో మాత్రం పరిస్థితి ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. బేసిన్ పరిధిలోని చాలా జిల్లాల్లో భూగర్భజలాలు గతేడాదితో పోల్చితే గణనీయంగా పడిపోయాయి. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటినుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఆ ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరదకాలువ తదితర ప్రాజెక్టులను అనుసంధానించి అవసరం మేరకు ఎప్పటికప్పుడు జలాలను ఎత్తిపోశారు. ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న చెరువులను క్రమం తప్పకుండా నీటితో నింపారు. కానీ మేడిగడ్డ డ్యామేజీ పేరిట ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడం ఆపేసింది. చెరువులు, చెక్‌డ్యామ్‌లలో నీరు లేక అడుగంటుతున్నాయి. హనుమకొండ, జనగామ, సిద్దిపేట మినహా గోదావరి బేసిన్‌లోని మిగిలిన అన్నిజిల్లాల్లో ఈ ఏడాది భూగర్భజలాలు లోతుకు పడిపోవడం గమనార్హం.
రీచార్జి తక్కువ.. వాడుతున్నది ఎక్కువ
భూగర్భ జలమట్టం వేగంగా పడిపోవడానికి ప్రధానకారణం ఈ ఏడాది ప్రాజెక్టుల్లో ఆశించినస్థాయిలో నీరు రాకపోవడం, మరోవైపు చెరువులను నింపకపోవడమేనని తెలుస్తున్నది. వాస్తవంగా భూగర్భ జలమట్టాన్ని పెంచడంలో చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో కాలువలు, చెరువుల ద్వారానే 10 శాతానికి పైగా భూగర్భజలమట్టం రీచార్జ్జి అవుతుంటుంది. చెరువులను నింపకపోవడం, కాలువల ద్వారా సాగునీటి సరఫరా లేకపోవడంతో ఆ మేరకు భూగర్భ జలాల రీచార్జి తగ్గిపోయింది. ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. ఎక్కడికక్కడ బోర్ల ద్వారా నీళ్లను తోడివేస్తుండడంతో వేగంగా భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని జలరంగ నిపుణులు చెప్తున్నారు. భూగర్భజలమట్టాలు పడిపోతుండడంతో నిన్నమొన్నటివరకు నిండుగా పోసిన బోరుబావులు ఇప్పుడు మొరాయిస్తున్నాయి. ప్రభుత్వం బరాజ్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి చెరువులు, ప్రాజెక్టులు నింపితే పరిస్థితి అదుపులోకి వస్తుంది. లేదంటే భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉన్నది.

Telangana Groundwater Level
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

