హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాజేందర్నగర్లో కొత్తగా నిర్మించనున్న హైకోర్టు భవనాల వద్ద జడ్జిల నివాస సముదాయాల కోసం ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేయనున్నారు. జోన్ 2 బిల్డింగ్స్ సముదాయ నిర్మాణాల నిమిత్తం ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్వీ భట్, జస్టిస్ అలోక్ అరాథే, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు.