SLBC tunnel | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలను గుర్తించడంలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జీపీఆర్) టెక్నాలజీ కీలకంగా పని చేసింది. ఈ పద్ధతిలో ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను ప్రమాద స్థ లంలో ఉపరితలం నుంచి భూమిలోపలికి పంపిస్తారు. బయటకు పరావర్తనం చెందే తరంగాల ఆధారంగా లోపల ఏ మున్నదో తెలుసుకుంటారు.
ఈ క్రమం లో టన్నెల్ ప్రమాదస్థలంలోనూ రాడార్ ద్వారా తరంగాలను పంపించగా టీబీ ఎం ముందుభాగంలో 3 మీటర్ల లోపల మృతదేహాల ఆనవాళ్లు కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. నిర్ధిష్టమైన ప్రదేశంలో ఆనవాళ్లు గుర్తిస్తే అక్కడే తవ్వకాలు జరిపే అవకాశం ఉంటుంది. అందుకోసమే జీపీఆర్ టెక్నాలజీ వాడి ఫలితాలు సాధించినట్టు చెప్పారు.