హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాన్ని నెలాఖరున నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రా ష్ర్టాలకు జీఆర్ఎంబీ ఇటీవల లేఖను రాసింది. బోర్డు సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఏమైనా ఉంటే ఈ నెల 18లోగా పంపించాలని జీఆర్ఎంబీ ఆ లేఖలో పేర్కొంది. ఇదిలా ఉంటే, గోదావరిలో మిగులు జలాల లభ్యతపై కేంద్ర జలసంఘం ఇటీవల సమర్పించిన నివేదికతోపాటు పెండింగ్ ప్రాజెక్టుల డీపీఆర్‌పై ఈ భేటీలో చర్చించే అవకాశముంది.