హైదరాబాద్/నిజాంసాగర్, అక్టోబర్31 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛత హీ సేవా స్పెషల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ ప్రాజెక్టును గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్ పాండే శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టు పరిసరాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు, నీటి నిర్వహణ, నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారులు నిర్వహిస్తున్న శుభ్రతా కార్యక్రమాలను అభినందించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ దక్షిణామూర్తి, నీటిపారుదలశాఖ సిబ్బంది పాల్గొన్నారు.