హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ 2003 టీచర్లు సహా ఇతరశాఖల్లోని ఉద్యోగులను పాత పింఛన్ వర్తింపు అంశంపై కాంగ్రెస్ సర్కార్ మీన మేషాలు లె క్కిస్తున్నది. వీరు పాత పింఛన్ అమలుకు అ ర్హులేనని సాక్షాత్తు హైకోర్టు తీర్పు ఇచ్చినా అ స్సలు ఖాతరు చేయడంలేదు. ఓపీఎస్ అమ లు చేయడంలేదు. ఇదేవిషయంపై ఏపీ మంగళవారం నిర్ణయం తీసుకున్నది. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఏపీ ఉద్యోగులకు పాత పింఛ న్ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఉద్యోగులకు ఓపీఎస్ అమలెప్పుడు అని ఉద్యోగ సంఘాల నేతలు సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు. మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి మోసం చేస్తారా..? హైకో ర్టు తీర్పును గౌరవించరా..? అంటూ నిలదీస్తున్నారు. 2003లో నియమితులైన తెలంగాణ ఉద్యోగులు పాత పింఛన్‌కు అర్హులేనని, వారికి ఓపీఎస్ అమలుచేయాలని హైకోర్టు రెండుసార్లు తీర్పిచ్చినా అమలుచేయకుండా సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
20 ఏండ్లుగా ఎదురుచూపులు..
2004 సెప్టెంబర్ 1న సీపీఎస్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. 2003లో నోటిఫికేషన్ జారీ అయ్యి.. 2004లో ఉద్యోగాల్లో చేరిన వారు ఉండగా, వీరిని బలవంతంగా కాంగ్రెస్ సర్కార్ సీపీఎస్ విధానంలోకి నెట్టింది. 2003 డీఎస్సీ టీచర్లతోపాటు, కానిస్టేబుల్, గ్రూప్-1, హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు సీపీఎస్‌లో చేరాల్సి వచ్చింది. దాదాపు 12వేల మంది ఉద్యోగులుంటారని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. కానీ వాస్తవానికి నోటిఫికేషన్‌ను ప్రామాణికంగా తీసుకుని సీపీఎస్‌ను అమలుచేయాల్సి ఉండగా, పోస్టింగ్ తేదీ ఆధారంగా సీపీఎస్‌ను అమలు చేశారు. దీంతో ఆయా టీచర్లు, ఉద్యోగుల పాలిట ఇది శాపంగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వీరంతా బలవంతంగా సీపీఎస్ పరిధిలో చేరారు. 20 ఏండ్లుగా పాత పింఛన్ అమలుకోసం ఉద్యోగులు పోరాడుతున్నారు. అయినా సర్కార్ కనికరించడంలేదు.
రాష్ర్టాలకు ఎగ్జిట్ అయ్యే అవకాశమున్నది: టీఎస్ సీపీఎస్ఈయూ
ఏపీలో పాత పింఛన్ అమలు హామీతో పీఎఫ్ఆర్డీఏ నిబంధనల్లో ఎగ్జిట్ పాలసీ ఉందని రుజువయ్యిందని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్ సీపీఎస్ఈయూ) అభిప్రాయపడింది. రాష్ర్టాలు ఎగ్జిట్ అయ్యే అవకాశమున్నదని నిరూపితమయ్యిందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ స్థి తప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ పేర్కొన్నా రు. దీంతో సీపీఎస్ రద్దు అధికారం రాష్ర్టాలదేనని తేలిపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను ర ద్దు చేసి, పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాత పింఛన్ అమలుచేస్తే.. రూ. 20 వేల కోట్ల లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. హిమాచల్, ఝార్ఖండ్ రాష్ర్టాల తరహాలో ఒకేసారి అం దరికి ఓపీఎస్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ చొరవ చూపాలి సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం
పాత పింఛన్ అమలుపై ఏపీ నిర్ణయా న్ని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం స్వాగతించింది. ఇదే తరహాలో పాత పింఛన్ అమలుకు తెలంగాణ సర్కార్ చొరవ చూపాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, హైకోర్టుతీర్పును అమలుచేయాలని కోరారు. కేంద్రం జారీచేసిన మెమో నంబర్ 57/4, 57/5 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్‌ను పునరుద్ధరించుకోవచ్చని స్పష్టంచేశారు.