Green India Challenge | కేసీఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా చాలెంజ్..రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్
కేసీఆర్ స్ఫూర్తితో పురుడుపోసుకొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ హరితసేనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం వెనుక, మొక్కలు నాటి వాటిని సంరక్షించిన ప్రతి ఒక్కరి కృషి ఉందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ అన్నారు.
- అవార్డు హరిత సైనికులందరికీ అంకితం
- రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్
- గౌరారంలో హరిత సైనికుల ఘన సన్మానం
గజ్వేల్, ఏప్రిల్ 29: కేసీఆర్ స్ఫూర్తితో పురుడుపోసుకొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ హరితసేనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం వెనుక, మొక్కలు నాటి వాటిని సంరక్షించిన ప్రతి ఒక్కరి కృషి ఉందని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ అన్నారు. బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ అవార్డు అందుకున్న సందర్భం గా బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండ లం గౌరారంలోని ఫామ్స్టే రిసార్ట్‌లో గ్రీన్ ఇండియా చాలెంజ్ హరిత సైనికుల ఆధ్వర్యంలో సంతోష్‌ను ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీ సంతోష్ మాట్లాడుతూ.. హరితసేనకు దక్కిన గౌరవం మీ అందరిదని, మొక్కలు నాటి సంరక్షించిన ప్రతి చెయ్యికీ ఈ అవార్డు అంకితమని తెలిపారు. తెలంగాణలో అడవుల గణాంకాలు 7.8శాతంగా ఉన్నట్టు గుర్తించిన తరువాత కేసీఆర్ హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 280కోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ప్రణాళిక రూపొందించడంతో నేడు తెలంగాణలో అడవుల విస్తీ ర్ణం పెరిగిందని తెలిపారు.
కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో 2018లో ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో హరిత సైనికుల కృషి ఫలితంగా నేడు మంచి ఫలితాలు రాబట్టామ ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలోనే కమాండ్ వెబ్స్ లోగో రాబోతుందని వెల్లడించారు. ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లోకి తీ సుకెళ్లి విజయవంతంగా ముందుకు సాగేలా కృషి చేయాలని హరిత సైనికులను కోరారు. అనంతరం నీటిపొదుపుపై ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ సాగునీటిరంగ నిపుణులు విద్యాసాగర్‌రావు వర్ధంతి సందర్భంగా మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, హరితసేన రాష్ట్ర నాయకులు రాఘవేందర్‌యాదవ్, కరుణాకర్‌రెడ్డి, చెప్యాల రాజేశ్వర్‌రావు, సతీశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

