Green India | లండన్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన వృక్షార్చనలో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి విజయవంతం చేయాలని లండన్లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ – వృక్షార్చన” పోస్టర్ని ఎన్నారై బీఆర్ఎస్, టాక్ నాయకులు ఆవిష్కరించారు.
ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలంతా వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్కు అరుదైన పుట్టినరోజు కానుకనివ్వాలని, మన ప్రాంతం పచ్చబడాలనే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ చేస్తున్న మహా యజ్ఞంలో భాగస్వాములు అవ్వాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ నాయకులు నవీన్ రెడ్డి, సుప్రజ, రవి రేతినేని, రవి పులుసు, క్రాంతి పాల్గొన్నారు.