Green India Challege | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం.. ఎంపీ సంతోష్‌ను అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Green India Challege | రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్‌కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
Green India Challege | రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్‌కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని రాష్ట్రపతికి వివరించారు. మొక్కల ప్రాధాన్యం తెలిపేలా రూపొందించిన వృక్షవేదం పుస్తకాన్ని రాష్ట్రపతికి అందించారు.
అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన ఈ ఐదేళ్లలో నాటిన మొక్కలు, సాధించిన ప్రగతిని, మొకలు నాటడంపై ప్రజల్లో కలిగించిన అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతికి వివరించారు. ఎంపీ సంతోష్ కుమార్ చెప్పిన విషయాలను ఆసక్తిగా తెలుసుకున్న రాష్ట్రపతి.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొకలు నాటుతున్న విషయం తనకు కూడా తెలుసని చెప్పారు. తనకు మొకలు నాటడం అంటే చాలా ఇష్టమని.. ఇప్పటికే అనేక సందర్భాల్లో మొక్కలు నాటినట్లు రాష్ట్రపతి తెలిపారు.
వచ్చే హైదరాబాద్ పర్యటనలో ఈ సారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతానని తెలిపారు. ఇంత నిస్వార్థమైన కార్యక్రమాన్ని అంకితభావంతో ముందుకు తీసుకుపోతున్న ఎంపీ సంతోష్‌ను ఆమె అభినందించారు. ప్రజోపయోగమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రపతి చొరవ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై ఆమె అభిమానం అద్భుతమైన అనుభవమంటూ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ వెంట రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామాత్యులు సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

