e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News పర్యావరణహితంగా టీఎస్‌ఈఆర్సీ భవనం

పర్యావరణహితంగా టీఎస్‌ఈఆర్సీ భవనం

  • భవిష్యత్తులో అన్ని భవనాలకు రోల్‌ మోడల్‌ అవుతుంది
  • నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (నమస్తే తెలంగాణ): పర్యావరణహితంగా నిర్మించబోతున్న తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (టీఎస్‌ఈఆర్సీ) భవన్‌ రాష్ట్రంలో మున్ముందు నిర్మించబోయే ప్రభుత్వ భవనాలకు ఉత్తమ మోడల్‌గా నిలుస్తుందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో టీఎస్‌ఈఆర్సీ నూతన భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ఉత్తమ డిజైన్‌, సోలార్‌ ప్యానెల్స్‌, వెంటిలేషన్‌ తదితర సదుపాయాలుండే ఈ భవనం ఒక రీసెర్చ్‌ సెంటర్‌గా పనికొస్తుందని తెలిపా రు. పర్యావరణ అనుకూలమైన ఈ భవనంలో ఉద్యోగుల పనిసామర్థ్యం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. 2022, అక్టోబర్‌ నాటికి నూతన భవనం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టీఎస్‌ఈఆర్సీ చైర్మన్‌ తన్నీరు శ్రీరంగరావు మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పర్యావరణహితంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఇంధనశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, గవర్నర్‌ కార్యాలయ కార్యదర్శి సురేంద్రమోహన్‌, టీఎస్‌ఈఆర్సీ సభ్యులు మనోహర్‌రాజు, బీ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement