లక్ష్మణచాంద, జూలై 28: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం న్యూ కంజర్కు చెందిన కొండూరు సాయవ్వకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్టు జూన్ 5న అధికారులు మంజూరుపత్రం అందజేశారు. అధికారుల సూచనమేరకు ఇంటి నిర్మాణం కోసం పాత ఇంటిని కూలగొట్టింది. తీరా అధికారులు మంజూరు పత్రంలో ఆధార్ నంబర్ తప్పుగా ఉందని, ఇంటి క్యాప్చరింగ్, ఆన్లైన్లో నమోదు కుదరదని తేల్చి చెప్పారు.
కొత్త ఇల్లు మంజూరైందని ఉన్న ఇంటిని కూలగొట్టుకున్నానని, తనకు న్యాయం చేయాలని 15 రోజులుగా ఆమె అధికారులను ప్రాధేయపడుతున్నా పట్టించుకోవడంలేదు. ఈ విషయమై.. గృహనిర్మాణ శాఖ ఏఈ అక్షయను వివరణ కోరగా.. ఆధార్ నంబర్ మార్చడం కుదరడంలేదని వెల్లడించారు.