మనుమడిని కాపాడబోయి తాత మృతి.. బోరుపక్కన గుంతలో పడ్డ బాలుడు
పొలంలో బోరు పక్కన ఏర్పడిన గుంతలో మనుమడు పడిపోగా కాపాడబోయిన తాత మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లికి చెందిన కంటు పెద్ద వెంకన్న, నాగమ్మ కూతురు శ్రావణిని పదేండ్ల క్రితం నిడమనూరు మండలం నారమ్మగూడేనికి చెందిన నాగబోయిన అంజయ్యకు ఇచ్చి వివాహం చేశాడు.
- నల్లగొండ జిల్లా యాద్గార్‌పల్లిలో ఘటన
మిర్యాలగూడ రూరల్, మే 16 : పొలంలో బోరు పక్కన ఏర్పడిన గుంతలో మనుమడు పడిపోగా కాపాడబోయిన తాత మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లికి చెందిన కంటు పెద్ద వెంకన్న, నాగమ్మ కూతురు శ్రావణిని పదేండ్ల క్రితం నిడమనూరు మండలం నారమ్మగూడేనికి చెందిన నాగబోయిన అంజయ్యకు ఇచ్చి వివాహం చేశాడు. వారికి కొడుకు హిమాన్షు, కూతురు లోహిత ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పది రోజుల క్రితం పిల్లలు అమ్మమ్మ ఇంటికి వచ్చారు. శనివారం ఉదయాన్నే తాత వెంకన్న పొలానికి వెళ్తుండగా ఆయన వెంట ఇద్దరు పిల్లలు కూడా వెళ్లారు.
తాత పొలం వద్ద పనిలో నిమగ్నంకాగా మూడేండ్ల హిమాన్షు ఆడుకంటూ బోరుబావి పక్కన ఉన్న 12 అడుగుల గుంతలో పడిపోయాడు. గమనించిన తాత మనుమడిని కాపాడే క్రమంలో ఆదే గుంతలో తలకిందులుగా పడిపోయాడు. అక్కడే ఉన్న మనుమరాలు సమీపంలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా..వారు ఘటనా స్థలానికి చేరుకుని సైదులు అనే యువకుడి కాళ్లకు తాడు కట్టి తలకిందులుగా గోతిలోకి దించి వెంకన్న, బాలుడిని వెలికి తీయించారు. వీరిని మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా వెంకన్న మృతిచెందాడు. హిమాన్షు సురక్షితంగా ఉన్నాడని, మృతుడి భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

