యుజీన్ (యుఎస్ఏ) : వరల్డ్ అథ్లెటిక్స్ అండర్-20 చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. పురుషుల జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ రజతం సాధించాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధ రాత్రి జరిగిన ఫైనల్లో 19 ఏండ్ల అశిష్ మూడో ప్రయత్నంలో ఈటెను 74.09 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తర్వాత ఈ టోర్నీ జావెలిన్ త్రో ఈవెంట్లో పతకం నెగ్గిన భారత రెండో అథ్లెట్‌గా ఆశిష్ రికార్డు సృష్టించాడు.
2016లో నీరజ్ చోప్రా 86.48 మీటర్లతో ప్రపంచ జూనియర్ రికార్డుతో స్వర్ణం గెలుచుకున్నాడు. కాగా, మహిళల హైజంప్‌లో పూజ సింగ్ 1.79 మీటర్ల ఎత్తు నుంచి దూకి ఫైనల్‌కు అర్హత సాధించింది. పురుషుల లాంగ్ జంప్‌లో షానవాజ్ ఖాన్, జిథిన్ అర్జు న్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నారు.