తిరుమలాయపాలెం/ గద్వాల/మాగనూరు, మార్చి 17: పెండింగ్ వేతనాలు మంజూరు చేయాలని గ్రామపంచాయతీ కార్మికులు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
గద్వాల కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికులు ఆందోళన చేపట్టగా, నారాయణపేట జిల్లా మాగనూరు ఎంపీడీవో రహిమతుద్దీన్కు కార్మికులు వినతిపత్రం అందజేశారు.