హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కల్పించేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకొచ్చినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతకకు సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ సర్పంచుల సంఘం అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్, పంచాయతీరాజ్ చాంబర్స్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సీతకను సన్మానించారు.