హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) గురువారం సాయం త్రం 5 గంటలతో ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఈ మేరకు గురువారం ఎస్ఈసీ కమిషనర్ రాణికుముదిని ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం మూడు దశల్లో 11,497 సర్పంచ్, 85,955 వార్డులకు ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో 1,35,23,137 మంది ఓటర్లు (85.30 శాతం) తమ ఓటుహక్కు వినియోగించుకున్నట్టు పేర్కొన్నారు.