ఖానాపూర్, ఆగస్టు 19: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) విషయంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్‌కు చెంది న మాజీ ఎమ్మెల్యే, ఏఆర్ఎస్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లు యజమాని అజ్మీరా రేఖానాయక్‌పై కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తనపల్లిలోని అజ్మీ రా రేఖానాయక్‌కు చెందిన ఏఆర్ఎస్ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఈ నెల 18న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి ధాన్యం భారీగా కొ రత ఉన్నట్టు గుర్తించారు. 2022-23, 2023-24, 2024-25 యాసంగి సీజన్ల కు సంబంధించి మిల్లుకు కేటాయించిన ప్రభుత్వ ధాన్యంలో మొత్తం 9,639.962 టన్నుల కొరత ఉన్నట్టు తేల్చారు. ఆయా సీజన్ల కనీస మద్దతు ధర ప్రకారం కొరత ధాన్యం విలువ రూ.40.96 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
మూడు సీజన్లలో భారీగా కొరత
టీజీఎస్‌సీఎస్‌సీఎల్ తరఫున ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్‌కు కస్టమ్ మిల్లింగ్ కోసం 2022-23, 2023-24, 2024-25 యాసంగి 5 సీజన్లలో ప్రభుత్వ ధాన్యం కేటాయించారు. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్‌ను ప్రభుత్వానికి అందించాలి. రికార్డుల ప్రకారం కేటాయించిన ధాన్యానికి, అందించిన సీఎంఆర్‌కు మధ్య భారీ వ్య త్యాసం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 2022-23లో 6,821.640 టన్నుల ధాన్యం కేటాయించగా, 4,638.715 టన్ను ల సీఎంఆర్ ఇవ్వాలి. కానీ, ఇప్పటివరకు 831.071 టన్నులు మాత్రమే అందించా రు. 116.541 టన్నుల ధాన్యం వేలం వే యగా, ఇంకా 5,482.936 టన్నులు నిల్వ ఉండాలి. కానీ, తనిఖీలో ధాన్యం, బియ్యం నిల్వలు సున్నాగా తేలాయి. 2023-24 యాసంగిలో 7,430.840 టన్నలు ధాన్యం కేటాయించగా, 5,052.971 టన్నుల సీఎంఆర్ ఇవ్వాలి. ఇప్పటివరకు 3,205.269 టన్నులు మాత్రమే అందించారు. ఇంకా 2,717.209 టన్నుల ధాన్యం అందుబాటు లో ఉండాల్సి ఉండగా, మిల్లులో ధాన్యం, బియ్యం నిల్వలు లభించలేదు. 2024-25 యాసంగిలో 2,413.640 టన్నులు కేటాయించగా, 1,641.275 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 343.200 టన్నులు మాత్రమే అందించారు. ఇంకా 1,908.934 టన్నుల ధాన్యం అందుబాటులో ఉండాల్సి ఉండగా, తనిఖీలో 469.117 టన్నులు మాత్రమే లభించాయి.
జిల్లా మేనేజర్ ఫిర్యాదుతో కేసు
ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం, నమ్మకద్రోహం ఆరోపణలపై టీజీఎస్‌సీఎస్‌సీఎల్ నిర్మల్ జిల్లా మేనేజర్ సీహెచ్ సుధాకర్ ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ యజమాని అజ్మీ రా రేఖాశ్యామ్ నాయక్‌పై ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 165/2026 నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 316 (2), 316(5), 318(4), అత్యవసర వ స్తువుల చట్టం సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలు అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నది.