వడ్లకొండ తెలంగాణ

- కొన్న ధాన్యం 90 లక్షల టన్నులు
- ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అత్యధికం
- ముగిసిన యాసంగి కొనుగోళ్లు
- ఏడేండ్లలో 576% పెరుగుదల
- ఒక్కఏడాదే 1.40 కోట్ల టన్నులు
- యాసంగిలో రికార్డు దిగుబడి
- ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనికతతోనే సాధ్యం: మారెడ్డి
ఒకప్పుడు ఆకలికి ఏడ్చిన తెలంగాణ.. ఇప్పుడు అన్నపూర్ణగా అవతరించింది. నాలుగు గింజలు పండితే చాలనుకున్న తెలంగాణను నేడు ధాన్యం రాసులు ముంచెత్తుతున్నాయి. ఏటికేడు ధాన్యం దిగుబడుల్లో రికార్డులు తిరగరాస్తున్నది. ఈ ఏడాది యాసంగిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏడేండ్ల తెలంగాణలోనే కాదు.. ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ ఇదే అత్యధికం.
ఒకప్పుడు ఆకలికి ఏడ్చిన తెలంగాణ.. ఇప్పుడు అన్నపూర్ణగా అవతరించింది. నాలుగు గింజలు పండితే చాలనుకున్న తెలంగాణను నేడు ధాన్యం రాసులు ముంచెత్తుతున్నాయి. ఏటికేడు ధాన్యం దిగుబడుల్లో రికార్డులు తిరగరాస్తున్నది. ఈ ఏడాది యాసంగిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది ఏడేండ్ల తెలంగాణలోనే కాదు.. ఉమ్మడి ఏపీ చరిత్రలోనే అత్యధికం. వానకాలంతో కలిపి ప్రభుత్వం ఏకంగా 1.40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. మిల్లర్లు, ఇతర వ్యాపారులు కొనుగోలుచేసిన ధాన్యం కలిపి తెలంగాణలో ఒక్క ఏడాది ధాన్యం దిగుబడి రెండుకోట్ల టన్నులు దాటింది.
హైదరాబాద్, జూన్ 17(నమస్తే తెలంగాణ): రైతుబిడ్డ రాజుగా ఉంటే.. ఆ రాజ్యంలో రైతులకు కష్టమనేదే ఉండదనే నానుడి తెలంగాణలో అక్షరాల సత్యమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్ష, కార్యదక్షతతో రాష్ట్ర సాగురంగ స్వరూపాన్నే మార్చేశారు. కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టులు పూర్తిచేసి నెర్రెలు బారిన నేలలకు నీళ్లు మళ్లించారు. రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదే (వానకాలం, యాసంగి కలిపి) 2 కోట్ల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో పౌరసరఫరాలశాఖ తరఫున ప్రభుత్వం 1.40 కోట్ల టన్నుల పంటను కొనుగోలుచేసింది. వానకాలంలో 48.85 లక్షల టన్నుల కొనగా.. యాసంగిలో రికార్డు స్థాయిలో 90 లక్షల టన్నులు సేకరించింది. వానకాలం, యాసంగి కలిపి మిల్లర్లు, ఇతర వ్యాపారులు 60 లక్షల టన్నులను కొన్నారు. తెలంగాణలో ఏడేండ్లలో ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్లు 576% పెరిగింది.
వానకాలాన్ని మించుతున్న యాసంగి
యాసంగి పంట ఒక్కరోజు వంట అని పెద్దలు అంటుండేవారు. యాసంగిలో ఎక్కడో కానీ వరి సాగయ్యేది కాదు. వరిని ఎక్కువగా వానకాలం సాగుగానే చూసేవారు. కానీ, గత రెండేండ్లుగా వానకాలం కంటే యాసంగిలోనే వరి దిగుబడి అధికంగా వస్తున్నది. ప్రభుత్వం కొనుగోళ్లు కూడా అంతేస్థాయిలో పెరుగుతున్నాయి. గతేడాది యాసంగిలో రికార్డు స్థాయిలో 64.18 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. ఈసారి ఆ రికార్డును కూడా దాటి 90.01 లక్షల టన్నులను సేకరించింది.
కరోనా కాలంలో రైతన్నకు తోడుగా..
రైతు పండించిన పంటను అమ్ముకొనేందుకు కరోనా కష్టకాలంలో సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. మార్కెట్లకు, మిల్లులకు పంటను తరలించి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటుచేశారు. పంట సొమ్మును మూడు నుంచి నాలుగు రోజుల్లోనే నేరుగా రైతుల ఖాతాలోకి వేయిస్తున్నారు. ఒక్క యాసంగి సీజన్లోనే ధాన్యం కొనుగోలు కోసం రైతుల ఖాతాల్లో రూ.17వేల కోట్లు జమ చేశారు. 2020-21లో రెండు సీజన్లలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రూ.26,136 కోట్లు అందించింది. దీనికితోడు రైతుబంధు పథకం కింద రూ.7,508 కోట్ల చొప్పున ఏడాదిలో రెండుసార్లు పెట్టుబడి సాయం అందజేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కార్యదక్షతతోనే..
తెలంగాణలో యాసంగిలో రికార్డు స్థాయిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుచేశాం. ఇదంతా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైంది. ఆయన విధానాలే రాష్ట్రంలో సాగును పండుగచేశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావ డం నా అదృష్టం. ఇందుకు సీఎం కేసీ ఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా.
మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

