జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వడ్లు, మొక్కజొన్నలు నీటిపాలయ్యాయి. ప్రభుత్వం వడ్లు , మక్కలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో రైతులు కల్లాల్లో రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసుకున్నారు.
ఈ క్రమంలో అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. జిల్లాలో సుమారుగా 20.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా మల్హర్, మహాదేవపూర్, పలిమెల మండలాల్లో వర్షపాతం నమోదయింది. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.