గంజాయి డెడ్ డ్రాప్ దందా!.. ముగ్గురు అన్నదమ్ముల అరెస్ట్
లొకేషన్ ఆధారంగా ‘డెడ్ డ్రాప్' పద్ధతిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న ట్టు గుర్తించిన ఈగల్ ఫోర్స్ అధికారులు నిందితులను అరెస్టు చేసి 14 కేజీల గంజా యి, ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్‌లోని కార్యాలయంలో ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ గురువారం కేసు వివరాలు వెల్లడించారు.
- పోలీసులపైకి కుక్కను వదిలిన నిందితులు
- స్క్రూడ్రైవర్‌తో ఇన్స్పెక్టర్పై దాడి
- 14 కేజీల గంజాయి, గన్ స్వాధీనం
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): లొకేషన్ ఆధారంగా ‘డెడ్ డ్రాప్’ పద్ధతిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న ట్టు గుర్తించిన ఈగల్ ఫోర్స్ అధికారులు నిందితులను అరెస్టు చేసి 14 కేజీల గంజా యి, ఎయిర్‌గన్ స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్‌లోని కార్యాలయంలో ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ గురువారం కేసు వివరాలు వెల్లడించారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా నగరంలో గంజా యి సరఫరా జరుగుతున్నట్టు సమాచారం అందడంతో బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ వద్ద అనుమానిత వ్యక్తిని సిబ్బం ది అదుపులోకి తీ సుకుని 50 గ్రాముల గం జాయి స్వాధీనం చేసుకున్నారు. విచా రణలో ఈ దందా వెనుక బాలానగర్ రాజీవ్ కాలనీకి చెందిన కిరణ్, దుర్గాప్రసాద్, కమలాకర్ అనే అన్నదమ్ములు ఉన్నట్టు గుర్తించారు.
నార్కోటిక్ టీమ్స్, మల్కాజిగిరి టీమ్‌లు నిందితుల ఇంటిపై దాడి చేయగా.. ఇంట్లో కుక్కను వదిలి వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు. మల్లేశ్ అనే ఇన్స్పెక్టర్పై కిరణ్ స్రూడ్రైవర్తో దాడి చేశాడు. ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 14 కేజీల గంజాయి, ఒక ఎయిర్‌గన్‌ను సీజ్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్టు గు ర్తించారు.
ఒడిశాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్ తీసుకొని, చెత్తకుప్పలు, రోడ్ల వెంబడి, కార్ల పక్కన గంజాయి పెట్టి ఆ ఫొటో కస్టమర్ కు పంపుతారు. అతను వచ్చి అక్కడ ప్యాకెట్ తీసుకోగానే వీరు వెళ్లిపోతారు. ఈ డెడ్ డ్రాప్ దందాను 2022 నుంచి కొనసాగిస్తున్నారని, ఇప్పటివరకు 203 మందికి గంజాయి సప్ల య్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. వినియోగదారుల్లో 100 మందికి పరీక్షలు చేయగా 72 మందికి పాజిటివ్ వచ్చిందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

