హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయుల జీపీఎఫ్ వివరాలను ఆన్లైన్లో ఉంచాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పంచాయతీరాజ్ సెక్రటరీని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్న య్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా కలిసి వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ అయిన, కొత్త జిల్లాలకు బదిలీ అయిన టీచర్లకు జీపీఎఫ్ జమచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.