హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నది. ఉభయలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం ఉంటుంది. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గవర్నర్ ప్రసంగంపై సుదీర్ఘంగా చర్చించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ ఉభయ సభల ముందు ఉంచనున్నారు.