హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌ను గుర్తుతెలియని వ్య క్తులు హ్యాక్ చేశారు. హ్యాకింగ్‌పై సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు బుధవారం రాజ్‌భవన్ వర్గాలు ఫిర్యాదు చేశాయి. ఏసీపీ చంద్‌పాషా నేతృత్వంలో ని బృందం కేసు దర్యాప్తు చేపట్టింది. డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ @డాక్టర్ తమిళిసైగవ్ పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా ఓపెన్ కాకపోవటంతో పాటు బ్లూ టిక్ పోయింది. హ్యాక్ అనుమానం రావటంతో, వెంటనే దర్యాప్తు చేపట్టాలని రాజ్‌భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్‌క్రైమ్ పోలీసులు హ్యాకింగ్ జరిగిందా? లేదా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.