మేడారం : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మేడారం సమ్మక్క – సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి మేడారం చేరుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా గిరిజనులందరికీ జాతర శుభాకాంక్ష తెలిపారు. జాతరకు రావడం సంతోషంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి పోవాలని సమ్మక్క, సారలమ్మను వేడుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. మరో వైపు మరికొద్ది గంటల్లో మేడారం జాతర ముగియనున్నది. సమక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు.