కంటోన్మెంట్, డిసెంబర్ 30: తాను రాజీనామా చేసున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్పష్టంచేశారు. నిరాధార వార్తలను ప్రచారం చేయొద్దని కోరారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అవి మరింత వైరల్‌గా మారాయి. కాగా, శనివారం బోయిన్పల్లి అనురాధ టింబర్ ఎస్టేట్‌ను పర్యటించిన సం దర్భంగా గవర్నర్ తన రాజీనామాపై వస్తున్న వార్తలను ఖండించారు. టింబర్ డిపోలో తయారవుతున్న అయోధ్య రామాలయం ద్వారాలు, శిల్పాలను తిలకించారు. అయోధ్య రామాలయానికి తెలంగాణలో ద్వారాలను తయారు చేయడం అభినందనీయమన్నారు. టింబర్ ఎస్టేట్ అధినేతలు చదలవాడ శరత్‌బాబు, కిరణ్, ద్వారాల శిల్పి రమేశ్‌కుమార్‌ను గవర్నర్ అభినందించారు.