హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభువు జీవితం ప్రేమ, సత్యం, కరుణ, సోదరభావం, త్యాగానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. ఈ క్రిస్మస్ వేడుకలు ఆనందాన్ని, ప్రేమను, శాంతిని, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల స్ఫూర్తితో ఈ ప్రపంచం సంపన్నంగా, ఆరోగ్యవంతంగా, శాంతియుతంగా ఉండాలని ప్రార్థించాలన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని గవర్నర్ సూచించారు.