కాలు జారి కింద పడిపోయిన గవర్నర్ తమిళిసై
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మామల్లాపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయారు.
చెన్నై: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తమిళనాడులోని మామల్లాపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్.. నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను పైకిలేపారు. అయితే గవర్నర్‌కు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

గవర్నర్ తమిళిసై ఆదివారం తమిళనాడులో పర్యటించారు. మామల్లాపురం సమీపంలోని పత్తిపురం గ్రామంలో జరిగిన మొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో తన కారు దిగి వెళ్తుండగా నడుస్తూ నడుస్తూనే ఒక్కసారిగా కాలు స్లిప్ అవడంతో కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను లేపి నిలుచోబెట్టారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలవలేదు.
అయితే తాను కిందపడిపోయినందున ఈ వార్త టీవీల్లో బ్రేకింగ్ న్యూస్, బిగ్ న్యూస్ అవుతుందని చమత్కరించారు. ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి పెద్దగా చర్చ జరుగుతుందో లేదోకానీ తాను కిందపడిపోవడం మాత్రం పెద్ద వార్తవుతుందంటూ సరదాగా పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం గవర్నర్ తమిళిసై అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

