హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): గవర్నర్ రాధాకృష్ణన్ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన అమరులను స్మరించుకొన్నారు. వారి త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని పేర్కొన్నారు. ప్రజా పాలనను అందిస్తాం: సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ది వేడుకలు జరుపుకొంటున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న అన్ని వర్గాల వారికి అభినందనలు చెప్పారు. విభజన చట్టంప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకే రాజధానిగా ఉంటుందని గుర్తు చేశారు.
ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రం: భట్టి
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. ఆకాంక్షలు, ఆలోచనల మేరకు సోనియాగాంధీ రాష్ట్ర ప్రజ ల చిరకాల కోరికను తీర్చారని గుర్తుచేశారు.