Assembly Budget Session | హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ): ఎన్నికల హామీలను అరకొరగా అమలుచేసి తామేదో విజయం సాధించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోట గొప్పలు పలికించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు పూర్తిస్థాయిలో అమలుకాని పథకాలే ఉండటం విశేషం. గత ప్రభుత్వం సాధించిన విజయాలను సైతం ప్రస్తుత ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
కిందపేర్కొన్న పథకాలన్నింటినీ అమలుచేసినట్టుగా రేవంత్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో గవర్నర్తో ప్రకటన చేయించింది. మరి ఈ పథకాలు మీకు అందాయా ? మీరే చెక్ చేసుకోండి