శంషాబాద్ రూరల్, అక్టోబర్ 20: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ పరిధిలో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు.
ఢిల్లీ వెళ్లేందుకు కారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా, ముందుగా వెళ్తున్న కారును డ్రైవర్ ఒక్కసారి ఎడమవైపునకు తిప్పాడు. దీంతో గవర్నర్ కాన్వాయ్‌లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని దెబ్బతిన్నాయి. గవర్నర్‌కు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.