కరీంనగర్ కమాన్‌చౌరస్తా, నవంబర్ 7: నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమవుతుందని, శ్రద్ధ, క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో జరిగిన రెండో స్నాతకోత్సవంలో హైదరాబాద్ కేంద్రీ య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ జేబీ రావు, శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ యు ఉమేశ్‌కుమార్, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా 25 మందికి పీహెచ్డీ పట్టాలతోపాటు 2018 నుంచి 2023 వరకు ప్రతిభ కనబరిచిన 161 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం విద్యార్థులను విజయం దిశగా తీసుకెళ్తుందని అన్నారు. విద్యార్థుల మేథాశక్తే వారి ప్రయోగశాలగా అభివర్ణించారు.