చికడపల్లి, జూన్12 : రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ గురుకులాలను గాలికొదిలేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి మైనార్టీ పాఠశాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 370 మంది విద్యార్థులు చదువుతున్నారు. 13 నెలల కిరాయి చెల్లించకపోవడంతో భవన యజమాని పాఠశాల భవనానికి తాళం వేశారు.
దీంతో ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు, బోధన, బోధనేతర సిబ్బంది గేటు బయటే గంటలపాటు పడిగాపులు కాశారు. 5 నెలల అద్దె బకాయి చెల్లిస్తామని చెప్పడంతో మధ్యాహ్నం 1.30 గంటలకు తాళం తెరిచారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాఠశాలకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని, కాంగ్రెస్ సర్కార్ అసమర్థత వల్ల గురుకులాల్లో ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.