హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ కట్ట బలోపేతంపై సర్కారు దృష్టిసారించినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. డ్యామ్‌పై ఉన్న గుంతల పూ డ్చివేతకు తగిన చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ.. రూ.664.80 కోట్ల అంచనా వ్య యంతో చేపట్టిన నెల్లికల్ ఎత్తిపోతల ఫేస్-1 పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీలోని కాలువల కు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అనుముల చెక్‌డ్యాం నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూ రు చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాం త్ జీవన్‌పాటిల్, ఆర్అండ్ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు.