హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనున్నది. ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ల (డీఆర్పీ)కు హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నారు. డీఆర్పీ ఎంపిక బాధ్యతను జిల్లాల డీఈవోలకు అప్పగించారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు విభాగాల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత డీఆర్పీలు ఆయా జిల్లాల్లో టీచర్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులు పొడిగించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 10తో జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ గడువు ముగియగా, మార్చి 10 వరకు పొడిగించినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.