Marri Rajasekhar Reddy | నేరేడ్మెట్, జూన్ 24 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని గౌతంనగర్ డివిజన్ రాజ శ్రీనివాస్‌నగర్ కాలనీ, వెంకటాద్రినగర్‌లో ఏడాదైనా పూర్తికాని బాక్స్డ్రైనేజీ పనులను వెంటనే చేపట్టాలని స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్‌తో కలిసి ఆందోళన చేపట్టారు.
మిర్జాలగూడ, వెంకటాద్రినగర్, రాజానగర్, రాజా శ్రీనివాస్‌నగర్, పవన్మోటర్ ప్రాంతాలు వరద ముంపునకు గురికాకుండా ఉండేందుకు పనులు తక్షణమే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ డీఈ లౌక్య ఎమ్మెల్యేతో మాట్లాడి బాక్స్ డ్రైనేజీ పనులకు విద్యుత్తు స్థంభాలు అడ్డుగా ఉన్నాయని వాటిని తొలగించగానే రెండు మూడు రోజుల్లో పనులు చేపడతామని హామీనిచ్చారు. దీంతో ఎమ్మెల్యే మర్రి, కార్పొరేటర్ మేకల సునీత ఆందోళన విరమించారు.
ఒక్క ఉపాధ్యాయుడితో చదువులెట్లా..?
ధరూరు, జూన్ 24: పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడితో పిల్లల చదువులెలా సా గుతాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఓబులోనిపల్లిలో పాఠశాల ఎదు ట సోమవారం ఆందోళనకు దిగారు. డ్యూ టీకి టీచర్ హాజరైనా పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తంచేశారు.
స్థానిక ప్రాథమిక పాఠశాలలో 128 మంది విద్యార్థులు ఉండగా, ఒక్క ఉపాధ్యాయుడే విధులకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఐదు తరగతులకు పాఠాలెలా బోధిస్తాడని ప్రశ్నించారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు తరలివెళ్లారు.