హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ప్రజాభవన్‌లో యూనియన్ నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్టు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది.
యాజమాన్యాలు రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరగా.. ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేసినట్టు భట్టి తెలిపారు. మరో రూ.600 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని, మిగిలిన రూ.300 కోట్లు కూడా త్వరలో చెల్లిస్తామని ప్రభుత్వం హా మీ ఇచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఒక కమిటీ వేయాలని కళాశాలల యాజమాన్యాలు అడగగా.. త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేసి త్వరగా కమిటీ నివేదిక వచ్చేలా చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. కమిటీలో అధికారులతోపాటు యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లను వెం టనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మిగతా రూ.900 కోట్లు విడుదలచేయాలని జాన్‌వెస్లీ లేఖలో డిమాండ్ చేశారు.